Episode 1: నిశ్శబ్దపు అడుగులు – రేపటి వెలుగు కోసం..

 

​ఎపిసోడ్ 1: నిశ్శబ్దపు అడుగులు – రేపటి వెలుగు కోసం..🪔

ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. కానీ, ఆ ఇంట్లోని గోడల మధ్య మాత్రం ఒక తెలియని అలజడి. కొత్త ఊరు, కొత్త ఇల్లు.. అన్నీ కొత్తవే కానీ, పాత అప్పుల తాలూకు బరువు మాత్రం వెన్నంటే ఉంది. గడిచిన 11 ఏళ్ల వైవాహిక జీవితంలో మేము కలిసి ఉన్న రోజుల కంటే, ఆయన దూరంగా ఉండి కష్టపడిన రోజులే ఎక్కువ. ఇప్పుడు అందరం ఒకే ఇంట్లో ఉన్నాం.. కానీ మౌనం అనే ఒక పెద్ద గోడ మా మధ్య నిలబడింది.

కిటికీ పక్కన కూర్చుని బయట చీకటిని చూస్తున్నాడు ఆయన. రోజంతా  కార్ డ్రైవింగ్ చేసి వచ్చిన అలసట ఆయన కళ్ళలో ఉంది. ఒకప్పుడు  ఎంతో కష్టపడి సంపాదించినా, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యాలు,  లక్షల అప్పుల ఊబి మమ్మల్ని నేలకేసి కొట్టాయి. ఇప్పుడు నెలకు వచ్చే ఆ చాలి చాలని జీతలతో, నా చిన్న ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం.. అన్నీ కలిపినా ఆ అప్పుల వడ్డీలకే సరిపోతున్నాయి.
Mother studying with sleeping children in a dim Telugu home


నేను హాలులో కూర్చుని ఒక తెల్లటి కాగితం వైపు చూస్తున్నాను. నా పక్కనే స్వరూప్, కార్తీక్ నిద్రపోతున్నారు. వాళ్ల అమాయకపు ముఖాలు చూస్తుంటే నా మనసులో ఒకటే యుద్ధం మొదలైంది.

నేను నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళాను. "ఏవండీ.. ఒక్క నిమిషం మాట్లాడాలి," అన్నాను చాలా మెల్లగా. ఆయన నుండి ఎలాంటి చలనం లేదు. సమాధానం రాదని నాకు తెలుసు, అయినా కొనసాగించాను.
"మనం ఈ ఊరికి వచ్చింది పిల్లల చదువు కోసం. బాబు ఇప్పుడు ఆరో తరగతికి వస్తున్నాడు. ఇది వాడు పునాది వేసుకోవాల్సిన సమయం. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తే, రేపు వాడు ప్రపంచంతో పోటీ పడలేడు. ఈ చిన్న చిన్న స్కూళ్లలో చదివిస్తే వాడు రేపు బయట ఎలా నెగ్గుకురాగలడు? నా చదువు ఆగిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ల చదువు ఆగిపోకూడదు కదా!"

ఆయన నిట్టూర్పు విడిచారు. "ఉన్నదాంట్లో సర్దుకుందాం అని అందరూ అంటున్నారు కదా.. ఇప్పుడు ఈ ఆదాయంతో మనం ఇంతకంటే ఏం చేయగలం? అప్పులు కడుతున్నాం, ఇల్లు గడుస్తోంది.. ఇంకేం కావాలి? నీకు పిల్లల కోసం ఏం చేయాలనిపిస్తే అది చెయ్, నేను వద్దు అనను కదా" అన్నారు.
ఆ మాట వినగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. 
"పిల్లలకి ఏం కావాలో అది చెయ్.. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్," అన్నారాయన.
పైకి అది నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు అనిపించినా, లోలోపల ఒక భయం మొదలైంది. ఒక తల్లిగా నేను పిల్లల కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఈ సమాజంలో, ఈ ఆర్థిక పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే ఏం చేయగలను?
నేను ఆయన వైపు తిరిగి అడిగాను, "మీరు 'చెయ్' అంటున్నారు కానీ, అది నేను 'ఒక్కదాన్నే' ఎలా చేయగలను? పిల్లలు మన ఇద్దరిది కదా! వాళ్ళ భవిష్యత్తు కోసం తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. మీరు కేవలం సరే అంటే సరిపోదు.. నా అడుగులో అడుగు వేయాలి. మనం ఎంత కష్టపడ్డామో, మన మధ్య ఎంత దూరం ఉందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం కలిసి ఉన్నది కేవలం ఒక ఇంట్లో ఉండటానికి కాదు.. ఒకే లక్ష్యం కోసం పోరాడటానికి.అంటూ..

"ఏవండీ.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం మన సంతోషం కోసం, మన ఆనందం కోసం పిల్లల్ని కన్నాం. వాళ్లు మన లోకం అనుకున్నాం. అలాంటప్పుడు, మనకు ఉన్న కష్టాల సాకుతో వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే హక్కు మనకు ఎక్కడిది? మనకు చేతకాక వాళ్ళను తక్కువలో బతికించే అధికారం మనకు లేదు. మనం కష్టపడాల్సింది వాళ్ళ కలల కోసం. 'నువ్వు చెయ్' అనడం కాదు.. 'మనం చేద్దాం' అని మీరు నాకు తోడుండాలి."..అంటూ...

"నా మనసులో ఉన్న మాట ఒక్కసారిగా బయటకు వచ్చింది...
నా మాటలకు నా భర్త నుంచి నాకు వచ్చిన సమాధానం కేవలం ..... ఆయన మౌనం మాత్రమే😔
ఆయన మౌనం వెనుక ఉన్నది బాధ్యతారాహిత్యం కాదు, 'నేనేం చేయగలనా?' అన్న నిస్సహాయత అని నాకు అర్థమవుతోంది.
నా మాటలు ఆయనకు వినిపిస్తున్నాయో లేదో తెలీదు. ఆయన మౌనమే సమాధానంగా మిగిలిపోయింది. నేను ఒక్కదాన్నే ఈ భారాన్ని ఎలా మోయగలను? ఇప్పుడు నేను చేస్తున్న ఈ చిన్న ఉద్యోగం మా అవసరాలకు సరిపోవచ్చు, కానీ మా కలలకు సరిపోదు. అందుకే, ఆయనకు చెప్పకుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
Close up of a woman's hand signing a document with a tear drop


నా చేతిలో ఉన్న ఆ కాగితం మీద వణుకుతున్న చేతులతో నా పేరు రాశాను. ఆ సంతకం పెడుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఇది కేవలం ఒక సంతకం కాదు.. నా బిడ్డల జీవితానికి నేను వేస్తున్న ఒక బలమైన పునాది.
 ఈ సంతకం మా సంసారాన్ని నిలబెడుతుందా? లేక ఉన్న ప్రశాంతతను కూడా దూరం చేస్తుందా? అన్నది నాకే తెలియదు. కానీ ఒక తల్లిగా నాకు తెలుసు.. 

నేను ఓడిపోతే నా బిడ్డల భవిష్యత్తు ఓడిపోతుందని.

నేను ఒక్కదాన్నే ఈ భారాన్ని ఎలా మోయగలనా?

నా చేతిలో ఉన్న ఆ కాగితం కేవలం ఒక పేపర్ కాదు, నా పిల్లల భవిష్యత్తును మార్చే ఒక ఆయుధం. కానీ ఆ సంతకం పెట్టే ముందు నా కళ్ల ముందు కొన్ని దృశ్యాలు మెదిలాయి. అవే నన్ను ఈ కఠినమైన నిర్ణయం వైపు నడిపించాయి.
మొదటిది, నిన్న సాయంత్రం స్వరూప్ స్కూల్ నుండి వస్తూ అడిగిన ఆ ప్రశ్న. "అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ పెద్ద స్కూల్‌కి వెళ్తున్నారు, అక్కడ కంప్యూటర్స్ ఉంటాయట, పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుందట.. నేను కూడా అక్కడికి వెళ్లొచ్చా?" అని అడిగినప్పుడు, వాడి కళ్లలోకి చూసి "వద్దు నాన్న, మనకు ఈ స్కూలే చాలు" అని చెప్పడానికి నా నోరు రాలేదు. మన అసమర్థత వల్ల వాడి ఆశలను చంపేసే హక్కు మనకు ఎక్కడిది?
రెండవది, నా భర్త పడుతున్న కష్టం. ఆయన డ్రైవింగ్ సీటులో గంటల తరబడి కూర్చుని, అలసిపోయి ఇంటికి వచ్చి, ఆ కాస్త జీతం అప్పుల వాళ్ల చేతిలో పెడుతున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించే ఆ నిస్సహాయత. ఆయనకు తోడుగా నిలబడాల్సిన బాధ్యత నాది కాదా? కేవలం సర్దుకుపోవడం అంటే సమస్యల నుండి పారిపోవడమే అని నాకు అర్థమైంది.

ఈ ఆలోచనలు నాలో ఒక తెగింపును ఇచ్చాయి. "మనం మన సంతోషం కోసం వాళ్ళని కన్నాం, కాబట్టి వాళ్ళకి తక్కువ జీవితాన్ని ఇచ్చే హక్కు మనకు లేదు" అన్న మాట నా గుండెలో గట్టిగా ప్రతిధ్వనించింది. ఆ ఆరాటమే నా వేళ్లలో వణుకును పోగొట్టి, పెన్నును గట్టిగా పట్టుకునేలా చేసింది. నా కన్నీటి చుక్క ఒకటి ఆ కాగితం మీద పడకముందే.. నా సంతకాన్ని పూర్తి చేశాను.
Close up of a woman's hand signing a document with a tear drop]



పిల్లలు గాఢనిద్రలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు.. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ రేపటి కోసం ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారని. నేను పేపర్ వైపు చూస్తున్నాను కానీ, మనసు మాత్రం ఆయన మౌనాన్ని ఎలా గెలవాలో ఆలోచిస్తోంది. ఈ నిశ్శబ్దం మనల్ని దూరం చేయకూడదు.. మనల్ని మన లక్ష్యం వైపు నడిపించాలి. అని కోరుకుంటున్నాను

నిద్రపోతున్న స్వరూప్ కళ్ళు తెరిచి నన్ను చూశాడు. వాడు నిద్రపోవడం లేదని నాకు అప్పుడే అర్థమైంది. వాడు నన్ను చూసి ఏమీ అడగలేదు, కానీ వాడి కళ్ళలో ఏదో భయం ఉంది. "అమ్మ సంతకం పెడితే మా జీవితం నిజంగా మారిపోతుందా?" అన్న ప్రశ్న వాడి చూపుల్లో నాకు స్పష్టంగా కనిపించింది. ఆ రాత్రికి ఆ ప్రశ్నే ఒక పెద్ద మలుపు.

"అమ్మ పెట్టిన ఆ సంతకం దేనికో తెలియక, నాన్న మౌనం వీడక.. ఆ ఇల్లు ఒక అగమ్యగోచర స్థితిలో ఉంది. తెల్లారితే ఆ కాగితం అమ్మను ఎక్కడికి తీసుకెళ్తుంది? అది మా కుటుంబానికి వెలుగునిస్తుందా.. లేక అమ్మానాన్నల మధ్య ఉన్న ఆ కొద్దిపాటి బంధాన్ని కూడా తెంచేస్తుందా?"

నిద్ర లేచిన స్వరూప్ మనసులో ఎన్నో ప్రశ్నలు...ఎంతో బాధ ఎవరిని అడగాలో కూడా తెలియని పసి మనసు....పడుకొని ఉన్న కార్తీక్ నీ చూసి...వాడికి వాడే ఏదో తెలియని ఆలోచల్లో పడిపోయాడు....
నెక్స్ట్ కథలో స్వరూప్...తన మన మనసులోని ప్రశ్నలు...
వాడి మనసులోని బాధ....తన తల్లికి చెప్పగలడా?..అమ్మ నీ ఆ తెల్ల కాగితం గురించి అడగగలడా?....తెలుసుకుందాం

Episode 2 నిశ్శబ్దపు అడుగులు

నేను మీ The blogging with teju ✍🏼 ✍🏼 🙏🏼 🙏🏼 



Comments

Popular posts from this blog

Part 1 Mental mom

The Divine Blueprint: Decoding Dashavatara and Scienceదశావతార రహస్యం: ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రం ఒకేచోట

Part 1: The Matsya Avatar – The Divine Protector of Knowledge (English)