మెంటల్ మామ్: పార్ట్-4 – అణిచివేయబడిన మేధస్సు.. చదువుకున్న కోడలి ఆత్మఘోష! 🎓🔥
మెంటల్ మామ్: పార్ట్-4– అణిచివేయబడిన మేధస్సు.. చదువుకున్న కోడలి ఆత్మఘోష! 🎓🔥 "ఆడపిల్లను చదివించండి.. ఆకాశాన్ని అందుకుంటుంది" అని గోడల మీద రాస్తారు. కానీ అదే అమ్మాయి పెళ్లయ్యాక ఆకాశాన్ని చూడాలని కిటికీ తెరిస్తే.. "నీకు ఇవన్నీ ఎందుకు? వంటింట్లో పోపు పెట్టడం నేర్చుకో" అని రెక్కలు విరిచేస్తారు. చదువుకున్న కోడలు ఇంటికి వస్తే అదొక గర్వంగా చూడాల్సింది పోయి, ఆమె తెలివితేటలు ఎక్కడ తమను మించిపోతాయో అని భయపడే అత్తమామలు, భర్తల మధ్య ఒక 'గోల్డ్ మెడలిస్ట్' పడే నరకం ఇది. అశ్వినీ ఒక టెక్నికల్ యూనివర్సిటీ టాపర్. ఆమె నడిస్తే కాన్ఫిడెన్స్, మాట్లాడితే నాలెడ్జ్. కానీ పెళ్లయిన నెల రోజులకే ఆమె డిగ్రీ సర్టిఫికేట్లు బీరువాలో అడుగున పడిపోయాయి. వాటి పైన ఇప్పుడు ఆమె అత్తగారి పాత చీరలు ఉన్నాయి. అత్తగారు: "చూడమ్మా.. నువ్వు ఎన్ని చదివినా ఈ ఇంట్లో నువ్వు వంట చేయాల్సిందే. నీ సాఫ్ట్‌వేర్ తెలివితేటలు బయట.. ఇక్కడ మాత్రం నువ్వు పద్ధతైన కోడలివి. పొద్దున్నే లేచి ఇల్లు తుడిచి ముగ్గు పెట్టడం నేర్చుకో." భర్త రవి: "నీ కెరీర్ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడి నా మూడ్ చెడగొట్టకు. నేను...