​Part 3 Strong women To mental mom: మీలో మిమ్మల్ని వెతుక్కునే 4 వాస్తవ గాధలు!

 

స్ట్రాంగ్ ఉమెన్ To మెంటల్ మామ్: మీలో మిమ్మల్ని వెతుక్కునే 4 వాస్తవ గాధలు!

హలో ఫ్రెండ్స్! నేను మీ teju,🙏🏼

​హలో ఫ్రెండ్స్! మనం మెంటల్ మామ్ సిరీస్ లో పార్ట్-1 (కెరీర్ త్యాగం), పార్ట్-2 (అత్తగారింటి వేధింపులు) లో ఒక ఆడపిల్ల తన ఆత్మగౌరవాన్ని ఎలా కోల్పోతుందో చూశాం. పార్ట్-3 లో మనం అత్తమామల గురించి మాట్లాడుకునే ముందు.. అసలు ఈ రోజుల్లో 'స్ట్రాంగ్ ఉమెన్' అంటే ఎవరు? స్ట్రాంగ్ గా ఉన్న ఆడపిల్ల.. 'మెంటల్' అనే ముద్ర వరకు ఎలా వెళ్తోంది? అనే పాయింట్ ని టచ్ చేయాలనిపించింది.

స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎవరు?

​చాలా మంది ఏమనుకుంటారంటే.. ఎదురు తిరిగేది, గట్టిగా అరిచేది, ఎవరినీ లెక్క చేయనిది స్ట్రాంగ్ ఉమెన్ అని. కానీ అది నిజం కాదు.

  • స్ట్రాంగ్ ఉమెన్ అంటే: తన కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా, పిల్లల ముందు నవ్వుతూ కనిపించే ధైర్యం ఆమె.
  • స్ట్రాంగ్ ఉమెన్ అంటే: తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఎవరో తొక్కేస్తుంటే, మౌనంగా ఉంటూనే తన విజయంతో సమాధానం చెప్పే ఓర్పు ఆమె.
  • స్ట్రాంగ్ ఉమెన్ అంటే: ఆకాశమంత ఎత్తుకు వెళ్లగల సత్తా ఉండి కూడా, తన కుటుంబం కోసం నేల మీద నడవడానికి ఇష్టపడే త్యాగం ఆమె.
  • ​అసలు చెప్పాలంటే.. ప్రతి రోజూ ఇంట్లో జరిగే వంద అవమానాలను భరిస్తూ కూడా, మరుసటి రోజు ఉదయం మళ్ళీ అందరికీ వేడివేడిగా టిఫిన్ వడ్డించే ఆ తల్లి.. ఒక అన్-స్టాపబుల్ Strong Woman!

​కానీ అలాంటి ఆమెను కూడా మన సమాజం, మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా "Mental Mom" గా మారుస్తున్నారో ఈ 4 రియల్ స్టోరీస్ ద్వారా చూద్దాం.

"ఆడది తలుచుకుంటే ఆకాశాన్ని అందుకోగలదు.. కానీ ఆమెకు కావాల్సింది ఒక చేయూత, కాస్త గౌరవం మాత్రమే!"

​Story 1; అర్ధరాత్రి కన్నీళ్లు (The 3 AM Silent Battle)

ఇది మన ఇంట్లో మోస్ట్ కామన్ గా జరిగే సీన్. ఒక బాబు లేదా పాపకి ఒంట్లో బాలేనప్పుడు, ఆ ఇంట్లో ఉండే 'స్ట్రాంగ్ ఉమెన్' ఎలా 'మెంటల్ మామ్' గా మార్చబడుతుందో ఇక్కడ చూడండి.

రాత్రి 2 గంటలు అవుతోంది. బయట వర్షం పడుతోంది. 8 నెలల బాబుకి 103 డిగ్రీల జ్వరం. వాడు వణుకుతూ ఏడుస్తున్నాడు. సుమ గంట నుంచి వాడిని ఎత్తుకుని రూమ్ అంతా తిరుగుతోంది. ఒళ్లంతా సెగలు కక్కుతోంది. తడి గుడ్డతో తుడుస్తోంది, పాలు పడుతోంది.. కానీ వాడు ఏడుపు ఆపట్లేదు.

పక్కనే బెడ్ మీద భర్త దుప్పటి ముసుగుపెట్టుకుని నిద్రపోతున్నాడు. బాబు ఏడుపుకి ఒకసారి కళ్ళు తెరిచి, విసుగ్గా సుమ వైపు చూసి ఇలా అన్నాడు:

"అసలు నీకు వాడు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్థం కావట్లేదా? గంట నుంచి గోల చేస్తున్నాడు.. రేపు మార్నింగ్ నాకు ఆఫీసులో వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది. కనీసం నిద్ర కూడా పోనివ్వవా? కాస్త వాడిని ఊరుకోబెట్టడం నేర్చుకో!"


Emotional Indian mother in a dark room at night, carrying her crying baby with a fever. The mother looks exhausted and sad, with messy hair and tired eyes, while her husband sleeps peacefully in the background on a bed, oblivious to the situation.

​ఆ మాట వినగానే సుమకి గుండెల్లో ఏదో కత్తితో పొడిచినట్టు అనిపించింది. రోజంతా ఇల్లు తుడిచి, వండి, అందరి అవసరాలు చూసి.. రాత్రంతా నిద్ర లేకుండా బిడ్డ కోసం తపిస్తుంటే, ఆయనకి తన 'నిద్ర' మరియు 'ఆఫీస్ మీటింగ్' మాత్రమే కనిపిస్తున్నాయి. తనకి నిద్ర ఉండదా? తనకి అలసట ఉండదా?

సుమ ఏడుస్తూ అడిగింది: "వాడికి జ్వరం ఉంది.. ఒక్కసారి పట్టుకోండి, నేను వెళ్లి సిరప్ తీసుకువస్తాను" అని.

అందుకు ఆయన సమాధానం: "నేను పట్టుకుంటే వాడు ఇంకా ఏడుస్తాడు, నువ్వే మేనేజ్ చెయ్. ఈ చిన్న దానికి నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు ఈ మధ్య మరీ చిరాకు ఎక్కువైపోతోంది.. సైకోలా బిహేవ్ చేస్తున్నావు!" అని చెప్పి పక్కకి తిరిగి పడుకున్నాడు.

The Transformation (ఎలా స్ట్రాంగ్ గా మారింది?):

ఆ రాత్రి సుమకి ఒక విషయం అర్థమైంది. తన కష్టాన్ని గుర్తించని మనిషి కోసం తను ఎందుకు ఏడవాలి? తను 'మెంటల్' కాదు, తను ఒక 'యోధురాలు'. మరుసటి రోజు ఉదయం ఆమె సీన్ మార్చేసింది.

  1. ​ఆయన లేవక ముందే బాబుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిపోయింది.
  2. ​ఆయన ఆఫీస్ కి వెళ్లే టైమ్ కి బ్రేక్ ఫాస్ట్ వండలేదు.
  3. ​ఆయన అడిగితే.. "నాకు బాబు హెల్త్ ఇంపార్టెంట్, నీ మీటింగ్ కంటే! నీ పనులు నువ్వు చేసుకోవడం నేర్చుకో" అని మొహం మీదే చెప్పేసింది
Confident Indian woman, now standing resiliently with a determined expression, directly facing her taken-back husband. She is wearing a neat cotton kurta, has tied her hair loosely, still showing some tired eyes but intense resolve. Small text bubble floats above her head in elegant, readable


​మొదట ఆయన షాక్ అయ్యాడు, అరిచాడు. కానీ సుమ తగ్గలేదు. "బాబు మన ఇద్దరి బాధ్యత.. కేవలం నా బాధ్యత మాత్రమే కాదు" అని స్ట్రాంగ్ గా నిలబడింది. ఆ రోజే ఆ ఇంట్లో ఒక కొత్త రూల్ మొదలైంది. ఇప్పుడు బాబుకి ఒంట్లో బాలేకపోతే ఆయన కూడా మేల్కొని సాయం చేస్తున్నాడు. సుమ తన మౌనాన్ని వీడి, తన హక్కుని అడిగింది.. అదే ఆమె సాధించిన విజయం!

Story 2 మెడల్ అండ్ వంటింటి పొగ (The Buried Dream)

​ఇది ఒక స్ట్రాంగ్, చదువుకున్న అమ్మాయి పెళ్లయ్యాక ఎలా 'బందీ'గా మారుతుందో, మళ్ళీ ఎలా ఫీనిక్స్ పక్షిలా లేచిందో చెప్పే కథ.

అశ్వినీ.. గోల్డ్ మెడలిస్ట్. తను నడిస్తే కాన్ఫిడెన్స్, మాట్లాడితే నాలెడ్జ్. ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆఫర్ లెటర్ చేతిలో ఉంది. తన కలలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అప్పుడు తను నిజంగానే ఒక 'Strong Woman'.

పెళ్లయిన కొత్తలో భర్త రవి చాలా బాగా చూసుకున్నాడు. కానీ ఉద్యోగం మాట ఎత్తగానే సీన్ మారిపోయింది.

“అశ్విని, నీకెందుకు ఉద్యోగం? నేను బాగానే సంపాదిస్తున్నానుగా! మన ఫ్యామిలీలో ఆడవాళ్లు బయట పనులు చేయడం ఎవరికీ ఇష్టం లేదు. నువ్వు ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటే చాలు” అన్నాడు చాలా సాదాసీదాగా.

​ఆ మాటతో అశ్విని రెక్కలు విరిచేసినట్టు అయ్యింది. తన చదువు, తన గోల్డ్ మెడల్, తన కలలు.. అన్నీ ఒకే ఒక్క మాటతో వంటింటి పొగలో కలిసిపోయాయి.

ఏళ్ళు గడిచాయి....

ఒకరోజు భర్త రవి ఆఫీస్ ఫ్రెండ్స్ ఇంటికి డిన్నర్ కి వచ్చారు. అశ్విని రకరకాల వంటలు చేసి, అందరికీ వడ్డిస్తోంది. అందరూ భోజనం చేస్తూ ఆఫీస్ విషయాలు, కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నారు. అశ్విని కి కూడా ఆ విషయాల మీద అవగాహన ఉంది, తను M.Tech చదివింది కదా!

​తను కూడా ఏదో చెప్పబోతుంటే.. రవి అందరి ముందు ఆమెను ఆపేశాడు. విసుగ్గా ఒక నవ్వు నవ్వి ఇలా అన్నాడు:

“చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడకి గోల్డ్ మెడల్ వచ్చింది కానీ.. ఇప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం. పాపం దీనికి బయట లోకం ఏం తెలియదు, ఈ టెక్నాలజీ అసలే అర్థం కాదు. వంటలు బాగా చేస్తుంది, అది చాలు!”

ఆ మాట వినగానే అందరూ నవ్వారు. కానీ అశ్విని కి గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది. ఆ అవమానం, ఆ తక్కువ చూపు ఆమెను 'మెంటల్' అయ్యేలా చేశాయి. ఆ రాత్రి తను అద్దం ముందు నిలబడి తన గోల్డ్ మెడల్ చూసుకుని ఏడ్చింది. "నేను చదివింది వంటలు చేయడానికి మాత్రమేనా?" అని.

Transformation of a proud graduate to a sad housewife holding a gold medal and a kitchen towel.

The Transformation (ఎలా స్ట్రాంగ్ గా మారింది?):

​ఆ రాత్రి అవమానం ఆమెలో ఒక కొత్త ఆలోచనను రగిల్చింది. తన కష్టాన్ని, తన తెలివితేటలను గుర్తించని మనిషి కోసం తను ఎందుకు ఏడవాలి? తను 'మెంటల్ మామ్' కాదు, తను ఒక 'యోధురాలివి (Warrior)'.

​మరుసటి రోజు నుంచే ఆమె సీన్ మార్చేసింది.

  1. ​తను వంట చేసే టైమ్ తగ్గించి, ఆన్లైన్ లో కొత్త టెక్నాలజీ కోర్సెస్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. భర్త ఆఫీస్ కి వెళ్ళాక, పాప నిద్రపోతున్నప్పుడు తను కష్టపడి చదివింది.
  2. ​ఒక ఆన్లైన్ కంపెనీలో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ కి అప్లై చేసింది. ఆమె తెలివితేటలు, ఆమె పోర్ట్‌ఫోలియో చూసి వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేశారు.
  3. ​మూడు నెలల తర్వాత ఫస్ట్ శాలరీ అకౌంట్‌లో పడగానే.. ఆ మెడల్ పక్కన తన ఆఫర్ లెటర్ పెట్టింది.

​ఆరోజు రవి ఆఫీస్ నుంచి రాగానే, ఆ ఆఫర్ లెటర్ ని టేబుల్ మీద పెట్టి ఇలా అన్నాడు:

“నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నేను వంటింటికే పరిమితం అని నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నాను. నువ్వు సంపాదిస్తున్నది నా ఇంటి అవసరాలకి, నేను సంపాదిస్తున్నది నా ఆత్మగౌరవం కోసం! నా విలువ ఏంటో నేను నిరూపించుకోవాలి” అని మొహం మీదే చెప్పేసింది.

A candid daylight photograph of the same determined Indian woman (Suma, from image_0.png, image_2.png, image_6.png), now smiling and holding up a official-looking job appointment letter with visible text reading "OFFER LETTER" while working on a laptop at a home desk, signifying her successful career return.

 ఆ క్షణం రవి కళ్ళల్లో షాక్ కనిపించింది. అశ్విని తన మౌనాన్ని వీడి, తన హక్కుని అడిగింది.. అదే ఆమె సాధించిన అతిపెద్ద విజయం!


story 3: పిల్లల భవిష్యత్తు - ఒక తల్లి నిశ్శబ్ద పోరాటం (The Battle for Kids' Future)

​ఇది మన చుట్టూ ఉన్న చాలా మంది తల్లుల కథ. పిల్లలకి ఇచ్చే చదువు వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి అని నమ్మి, దాని కోసం తనని తాను మెంటల్ అని పిలిపించుకున్న యోధురాలి కథ ఇది.

​తేజుకి ఒక క్లారిటీ ఉంది. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది.. రేపు తన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఒక మంచి అట్మాస్పియర్, మంచి స్కిల్స్ ఉండాలని తను కోరుకుంది.

"మనం కష్టపడ్డాం.. కానీ మన పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదు. వాళ్ళకి ఒక మంచి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి" అని భర్తకి, అత్తగారికి పదే పదే చెప్పేది.

 మొదట్లో అంతా బాగుంది అన్నారు కానీ, స్కూల్ ఫీజులు పెరిగేసరికి, పిల్లల మీద తేజు పెడుతున్న కాన్సంట్రేషన్ చూసి వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు.

 ఒకరోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.....

అత్తగారు: "నార్మల్ స్కూల్ లో చదివితే వాళ్ళు మనుషులు కాదా? నువ్వు మరీ ఓవర్ గా ఆలోచిస్తున్నావు. అంతంత ఫీజులు కట్టడం మా వల్ల కాదు!"

భర్త: "అవును తేజు.. నీకు మరీ పిచ్చి ముదిరిపోతోంది. పిల్లల్ని ఇంత కష్టపెట్టి చదవించలేం. నువ్వు చెప్పినంత స్తోమత మాకు లేదు. నువ్వు అనవసరంగా హైపర్ అవుతున్నావు.. నీకు మెంటల్ ఏమైనా ఎక్కిందా?"

తేజు ఆరోజు కొన్ని ప్రశ్నలు అడిగింది: 

A tense Indian family discussion. A determined woman (Teju) is explaining something passionately with papers in her hand, while her husband and mother-in-law look at her with judgmental expressions, mocking her. The atmosphere is heavy and emotional.

"ఈరోజు మనం వాళ్ళకి మంచి పునాది వేయకపోతే, రేపు వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో ఎలా బతుకుతారు?

 మనలాగే వాళ్ళూ సాదాసీదాగా ఉండిపోవాలా? 

"రేపు వాళ్ళు గెలవాలంటే నేడు మనం కష్టపడాలి"

అని ఎగ్జాంపుల్స్ తో సహా వివరించింది. కానీ వాళ్ళు వినలేదు. "నీకు మెంటల్.. అందుకే ఇలా గంటలు గంటలు మాట్లాడుతున్నావు" అని ఆమెను వెక్కిరించారు. ఆమె పాయింట్స్ ని సపోర్ట్ చేయకుండా, ఆమె మానసిక స్థితిని ఎగతాళి చేశారు.

The Transformation (ఒంటరి పోరాటం - సక్సెస్):

తేజు ఆ క్షణం డిసైడ్ అయ్యింది.. తన పిల్లల భవిష్యత్తు కోసం తను ఎవరి ముందూ తలవంచకూడదని.

  1. The Job & Blogging: తన పిల్లల చదువుల కోసం తను ఒక జాబ్ లో చేరింది. అంతేకాకుండా, పార్ట్ టైమ్ లో "The Blogging with Teju" అనే బ్లాగ్ స్టార్ట్ చేసింది. తనలాంటి తల్లుల కోసం తన ఆలోచనలను రాస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది.
  2. The Resilience: ఇంట్లో వాళ్ళు తనని 'సైకో' అన్నా, 'మెంటల్' అన్నా భరించింది. కానీ తన పిల్లలకి మాత్రం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంది. వాళ్ళకంటూ ఒక స్పేస్ ఇచ్చింది, వాళ్ళలోని టాలెంట్ ని ఎంకరేజ్ చేసింది.
  3. The Success: కొన్ని సంవత్సరాల తర్వాత.. తేజు పిల్లలు గొప్ప చదువులు చదివి, మంచి పొజిషన్స్ లో సక్సెస్ అయ్యారు. ఆరోజు తేజుని 'మెంటల్' అన్న అదే నోళ్ళు.. ఇప్పుడు 

"తేజు దార్శనికత వల్లే పిల్లలు ఈరోజు ఇంత గొప్పగా ఉన్నారు" అని పొగడటం మొదలుపెట్టాయి.

Story 4: అద్దం ముందు యుద్ధం - బాడీ షేమింగ్ 

ఇది మన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు ప్రతిరోజూ ఫేస్ చేసే సమస్య. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఒక మహిళ శరీరం ఆటోమేటిక్ గా మారుతుంది. ఇది ప్రకృతి సహజం. కానీ, సమాజం (కొన్నిసార్లు సొంత కుటుంబం కూడా) ఆ మార్పును అర్థం చేసుకోకుండా, ఆమెను ఎలా మానసికంగా హింసిస్తుందో, తను ఆ కామెంట్స్ ని తట్టుకుని ఎలా నిలబడిందో చెప్పే కథ ఇది

చాలామందికి బాడీ షేమింగ్ అంటే కేవలం లావుగా ఉన్నావని ఎగతాళి చేయడం మాత్రమే కాదు.. ఆ మాటల వెనుక ఒక మనిషి ఆత్మవిశ్వాసాన్ని చంపేయడం. లత విషయంలో ఇంట్లో జరిగిన పోరాటం సరిగ్గా ఇదే.

అవమానాల అగ్నిగుండం:

పిల్లలు పుట్టాక ఆమె తన రూపం గురించి ఆలోచించే సమయం కూడా దొరకలేదు. కానీ భర్తకు అది 'బద్ధకం'లా కనిపించింది. ఒక సాయంత్రం అందరూ కూర్చున్నప్పుడు..

"చూడు లత, పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉండేదానివి.. ఇప్పుడు ఎలా అయ్యావు? నువ్వు ఇలా కనిపిస్తుంటే నాకు నీ పక్కన నిలబడాలన్నా ఇబ్బందిగా ఉంది" అని భర్త నిష్టూరంగా అన్నాడు.

అత్తగారు ఆ మాటలకు వంత పాడుతూ.. "అవును, అసలు నీకు అందం మీద ధ్యాసే లేదు. పిల్లల మీదనో, ఆ చదువుల మీదనో దృష్టి పెడుతున్నాను అంటున్నావు కానీ.. నీ మొహంలో ఆ పాత కళ ఎక్కడా లేదు. ఇది ఇలాగే కొనసాగితే నీకు నిజంగానే మెంటల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి" అని మెంటల్ అనే ముద్రని ఇక్కడా వాడుతూ విమర్శించారు.

ఆ రాత్రి లత అద్దం ముందు నిలబడింది. అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసి తనకే అసహ్యింది. ఆ మాటల వల్ల తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా, గంటల కొద్దీ ఆలోచిస్తూ కూర్చునేది. ఆమె నిశ్శబ్దాన్ని చూసి వాళ్ళు "చూశారా.. దీనికి మతి పోయింది" అని ఇంకా వెక్కిరించారు.

A realistic and cinematic visual of a determined Indian woman (Teju). On one side, she is looking into a mirror with sadness, reflecting a cluttered and stressful environment. On the other side of the image, the same woman is outdoors in a park at dawn, wearing comfortable yoga attire, with a peaceful yet strong expression, looking at the rising sun. The transition symbolizes her journey from self-doubt to self-strength. Warm golden hour lighting, 8k resolution, emotional depth."


కానీ ఒకరోజు తన ఇద్దరు పిల్లల కళ్ళలోకి చూసింది. "నా కోసం కాకపోయినా, నా పిల్లలకు ఒక ధైర్యవంతురాలైన తల్లిని చూపించాలి" అని నిర్ణయించుకుంది.

  1. ఆరోగ్యమే ఆయుధం: ఎవరికో నచ్చడం కోసం కాకుండా, తన శక్తిని తిరిగి తెచ్చుకోవడం కోసం తను ఫిజికల్ యాక్టివిటీస్ మొదలుపెట్టింది. వాకింగ్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ తన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంది.
  2. ప్రొఫెషనల్ గ్రోత్: మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి తన బ్లాగింగ్‌ని ఒక థెరపీలా వాడుకుంది. ఆమె రాసిన ప్రతి అక్షరం ఆమెలోని నెగటివిటీని దూరం చేసింది.
  3. బౌండరీస్ సెట్ చేయడం: భర్త లేదా అత్తగారు మళ్ళీ తన రూపం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. "నా శరీరం నా బిడ్డలకు ప్రాణం పోసింది. దీని గురించి కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు" అని చాలా స్పష్టంగా, గంభీరంగా చెప్పేసింది.

కొన్ని నెలల తర్వాత.. లత ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యింది. తన కళ్ళలో ఆత్మవిశ్వాసం చూసి ఒకప్పుడు వెక్కిరించిన నోళ్ళు మూతపడ్డాయి. తన సక్సెస్, తన పిల్లల సక్సెస్ చూశాక.. బాడీ షేమింగ్ చేసే వాళ్ళ కంటే ఆమె ఎత్తు చాలా పెరిగిపోయింది.

ముగింపు: అసలైన 'స్ట్రాంగ్ ఉమెన్' అంటే ఎవరు?

​మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ నాలుగు కథలు కేవలం నలుగురు మహిళల గురించి మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్న కోట్లాది మంది మహిళల నిశ్శబ్ద పోరాటాలకు ప్రతిరూపాలు. చాలామందికి ఒక అపోహ ఉంది.. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎప్పుడూ గట్టిగా అరుస్తూ, ఎదుటివారిని ఎదిరించే మనిషి అని. కానీ నిజమైన బలం శబ్దంలో ఉండదు, ఆమె వ్యక్తిత్వంలో ఉంటుంది.

స్ట్రాంగ్ ఉమెన్ అంటే...

  • ఆత్మగౌరవాన్ని వదులుకోని వనిత: పరిస్థితులు తనని కిందకు లాగాలని చూస్తున్నప్పుడు, తన మీద తను నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడేదే అసలైన బలం.
  • మార్పును అంగీకరించే మనసు: పెళ్లయ్యాక వచ్చే బాధ్యతలు, శరీరం మారినా, రూపం మారినా.. తనని తాను ప్రేమించుకుంటూ, తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ధైర్యమే అసలైన అందం.
  • మౌనంగా గెలిచే యోధురాలు: ఇంట్లో వాళ్ళు తనని 'మెంటల్' అన్నా, పిచ్చి అని వెక్కిరించినా.. వారితో వాదించి శక్తిని వృథా చేసుకోకుండా, తన సక్సెస్‌తోనే సమాధానం చెప్పేది నిజమైన ధీశాలి.
  • పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చే తల్లి: తను కష్టాల్లో ఉన్నా, తన పిల్లలకు ఒక మంచి ప్రపంచాన్ని, మంచి విలువలని అందించడం కోసం ఒంటరి పోరాటానికైనా సిద్ధపడే తల్లికి మించిన శక్తి ఈ ప్రపంచంలో లేదు.

ముగింపు పలుకులు:

ఒక మహిళను అణచివేయడం సులభం కావచ్చు, కానీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. సమాజం వేసే ముద్రలు, ఇంట్లో వాళ్ళు చేసే విమర్శలు మీ ఎదుగుదలకు అడ్డంకులు కాకూడదు.. అవి మీ విజయానికి మెట్లు కావాలి. మీరు గెలిచే వరకు మిమ్మల్ని 'మెంటల్' అన్న వాళ్లే.. మీరు గెలిచాక మిమ్మల్ని చూసి 'గ్రేట్' అంటారు.

​గుర్తుంచుకోండి.. మీ విజయం మీ బాధ్యత!

​మరో ఆసక్తికరమైన అంశంతో, మరో కొత్త కథల సిరీస్ లో మళ్ళీ కలుద్దాం!... 

Mental mom part 4 link 👈🏼👈🏼

నేను మీ  The blogging with teju ✍🏼✍🏼🙏🏼🙏🏼

Comments

Popular posts from this blog

Part 1 Mental mom

The Divine Blueprint: Decoding Dashavatara and Scienceదశావతార రహస్యం: ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రం ఒకేచోట

Part 1: The Matsya Avatar – The Divine Protector of Knowledge (English)