Part 1 Mental mom
Mental Mom... 🤷🏼 ఈ పేరు వినగానే మీకు నవ్వు రావచ్చు, లేదా 'ఏంటి ఈ పేరు ఇలా ఉంది?' అనిపించవచ్చు. కరెక్టే! కానీ ఒక్కసారి ఆలోచించండి... పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు... పిల్లాడు అన్నం తినకపోతే తల్లడిల్లిపోయేది మనమే. వాడు దెబ్బ తగిలించుకుంటే మనకి రక్తం వచ్చినంతగా కంగారుపడేది మనమే. స్కూల్ కి లేట్ అవుతుంటే వాడు నిమ్మళంగా ఉన్నా, మనకు బిపి పెరిగిపోయి అరిచేది మనమే. పిల్లల ఫ్యూచర్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ డిసిప్లిన్ గురించి మనకు ఉండే ఆ ఆరాటం, ఆ పిచ్చి, ఆ తాపత్రయమే ఈ 'మెంటల్' అనే పదం. ఇది లోకం అనుకునే పిచ్చి కాదు, ఇది ఒక తల్లికి తన బిడ్డ మీద ఉండే ' Extreme Love and Concern' అవును, నేను నా పిల్లల విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలని ట్రై చేస్తూ, ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అవుతూ, ఒక్కోసారి అరుస్తూ... లోకం దృష్టిలో ఒక 'మెంటల్ మామ్' లా కనిపిస్తానేమో! కానీ ఆ మెంటాలిటీ వెనుక ఉన్నది కేవలం ఒక స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఈ బ్లాగ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది అదే... ' Every mom has a bit of a mental side when it comes to her kids, and that’s totally oka...









Comments
Post a Comment